India Vs Zimbabwe: జింబాబ్యేను మట్టికరిపించిన భారత్...తొలి వన్డేలో సూపర్ విక్టరి
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన టీమిండియా, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. ప్రతీకా రావల్ అజేయ సెంచరీ, షెఫాలీ వర్మ దూకుడైన ఇన్నింగ్స్‌తో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Details
బౌలర్ల విజృంభణ
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 49.5 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది.
శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్ చేసి 23 పరుగులకే 4 వికెట్లు పడగొట్టింది.
క్రాంతి గౌడ్ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగా, దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది.
జింబాబ్వే బ్యాటర్లలో బిజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Details
చితక్కొట్టిన రావల్
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన మంచి ఆరంభాన్ని అందించారు.
తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన తర్వాత మంధాన 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది.
ప్రతీకా రావల్ సంయమనంతో ఆడుతూ 96 బంతుల్లోనే సెంచరీ సాధించింది. వన్డేల్లో ఆమెకిది మూడో శతకం.
చివరి వరకు అజేయంగా నిలిచిన ప్రతీకా 100 పరుగులు చేయగా, షెఫాలీ 33 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
వీరిద్దరూ రెండో వికెట్‌కు 106 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత్ 27.1 ఓవర్లలోనే విజయంసాధించింది.
Details
ఆదివారం రెడో వన్డే
అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతీకా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదివారం వడోదరలో జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భారత జట్టు భావిస్తోంది.
బ్యాటర్లు, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో ఇదే దూకుడును రెండో వన్డేలోనూ ప్రదర్శించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.