Page Loader
India vs England: అభిషేక్ శర్మ ఊచ‌కోత‌.. మొదటి టీ20లో భారత్ ఘన విజయం 
అభిషేక్ శర్మ ఊచ‌కోత‌.. మొదటి టీ20లో భారత్ ఘన విజయం

India vs England: అభిషేక్ శర్మ ఊచ‌కోత‌.. మొదటి టీ20లో భారత్ ఘన విజయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
09:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 12.5 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తిచేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ అద్భుత ప్రదర్శన చేస్తూ అర్ధశతకంతో (79 పరుగులు; 34 బంతుల్లో; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగాడు. సంజు శాంసన్‌ (26 పరుగులు) మెరుగైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోఫ్రా 2 వికెట్లు, అదిల్‌ రషీద్‌ 1 వికెట్‌ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 132 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ విజయంతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

వివరాలు 

 అద్భుతమైన  ఆరంభం ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు,భారత బౌలర్ల ధాటికి కేవలం 132 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఓవర్‌లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. అనంతరం మూడో ఓవర్‌లో బెన్ డకెట్‌ను కూడా అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు.అదే సమయంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్‌లో హ్యారీ బ్రూక్,లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాడు.

వివరాలు 

ఇంగ్లండ్ జట్టు టాప్ స్కోరర్‌గా జోస్ బట్లర్

అయితే వికెట్లు పడుతుండటానికి మధ్య కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా,అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్,హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీసి చక్కని ప్రదర్శన చేశారు.