IND vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ వైపు దూసుకుపోతోంది. 247/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆఫ్రికా, టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేయగలిగింది. క్రీజులో ముత్తుసామి (56*), కైల్వేరీన్ (38*) అజేయంగా నిలిచి జట్టుకు బలమైన పట్టును అందిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 179 బంతుల్లో 70 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రెండో రోజు భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ రూపంలో ఫలితం దక్కలేదు. 300 పరుగుల మార్క్ దాటిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం బలమైన స్థితిలో నిలిచింది.
Details
రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు
ఇంకా మార్కో యాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ వంటి కీలక దిగువ వరుస బ్యాటర్లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఆఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (49) అర్ధ సెంచరీను కేవలం ఒక్క పరుగుతో చేజార్చుకున్నాడు. కెప్టెన్ టెంబా బవుమా (41) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35), టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించారు. అయితే వియాన్ ముల్డర్ (13) మాత్రం విఫలమయ్యాడు.