Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద అడుగు పెట్టాడు. భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
సెమీస్‌లో జరిగిన పోరులో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కారువానాను ఓడించి, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్‌తో మంగళవారం పోటీ పడనున్నాడు.
సెమీస్‌లో రెండు క్లాసిక్ గేమ్స్ డ్రా కావడంతో టై బ్రేక్ గేమ్స్ ఆడారు. టై బ్రేక్ గేమ్స్‌లోనూ రెండు ర్యాపిడ్ గేమ్స్ డ్రాగా ముగిసాయి. అ తర్వాత మొదటి గేమ్ డ్రా అయ్యింది. రెండో గేమ్‌లో ఫాబియానో కరువానా మీద పై చేయి సాధించాడు.
Details
విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు
ఇక ర్యాపిడ్ గేమ్ లో రెండో రౌండ్ కూడా మొదలైంది. రెండో రౌండ్‌లోని మొదటి మ్యాచ్ లో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. రెండో మ్యాచ్ డ్రా కావడంతో సెమీస్‌లో ప్రజ్ఞానంద విజయం దక్కించుకున్నాడు. ప్రస్తుతం తుదిపోరుకు సిద్ధమవుతున్నాడు.
ప్రజ్ఞానంద గెలుపుపై చెస్ దిగ్గజాల నుండి శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా స్పందించిన విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద విజయానికి సంతోషిస్తూ, ఫైనల్ లో గెలవాలని కోరుకున్నారు.
ప్రపంచ కప్ చెస్ ఫైనల్ మ్యాచ్ కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య మంగళవారం జరగనుంది. తుదిపోరులో ప్రజ్ఞానంద గెలవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. మరి ఫైనల్ లో గెలిచి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టిస్తాడా అనేది చూడాలి.