
భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
హీరో ఇంటర్ కాంటినెంటర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచులో భారత్ 1-0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది.
భారత తరుపున ఏకైక గోల్ ను కెప్టెన్ సునీల్ ఛెత్రి 81వ నిమిషంలో సాధించాడు. దీంతో సునీత్ ఛెత్రి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకూ 86 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తొలి మ్యాచులో మంగోలియాను 2-0 తో ఓడించిన భారత్.. వసుతూపై విజయం సాధించేందుకు కొంచెం శ్రమించాల్సి వచ్చింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలి అర్ధభాగంలో చాలా వరకు బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న భారత్ గోల్ చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది.
Details
అత్యధిక గోల్స్ చేసిన ఐదో ఆటగాడిగా ఛెత్రి రికార్డు
గత దశాబ్ద కాలంగా ఛెత్రీ భారత్ తరుపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ గోల్స్ చేశాడు. ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ (86) చేసిన ఐదో ఆటగాడిగా ఛెత్రి నిలిచాడు.
అతని కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో (122), అలీ దాయి (109), లియోనెల్ మెస్సీ (102), మొఖ్తర్ దహరి (89) ఉన్నాడు.
మైదానంలో తన భార్య సోనమ్ మ్యాచును తిలకిస్తుండగా గోల్ కొట్టిన ఛెత్రి ఫుట్ బాల్ ను తన టీషర్ట్ లోపల ఉంచి తన భార్య గర్భవతి అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో భారత తరుపున ఛెత్రీ అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బ్లూ టైగర్స్ తరుపున 135 మ్యాచుల్లో 86 గోల్స్ చేశాడు.