
కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నిర్ణయంతో పీఎస్‌జీకి గట్టి షాక్ ఇచ్చాడు.
పారిస్ సెయింట్ జర్మన్ జట్టును వీడి కొత్త క్లబ్ తో ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే పీఎస్ జీతో ఒప్పందం పొడిగింపుపై అతను సంతకం చేయడానికి నిరాకరించాడు. ఈ విషయంపై అతను క్లబ్ కు స్వయంగా లేఖ రాసి వివరించడం గమనార్హం.
ఈ మధ్య ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్‌జీ ఉన్న బంధానికి ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో ఎంబాపే కూడా వచ్చే సీజన్ లో కొత్త క్లబ్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరం అత్యుత్తమ ఆటగాళ్లలో ఎంబాప్పే ఒకరు.
Details
పీఎస్‌జీ తరుపున 212 గోల్స్ చేసిన ఎంబాపే
గతేడాది ఖతర్ లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ లో ఫైనల్లో అతను సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్స్ గోల్స్ చేసి సత్తా చాటాడు. ఆ టోర్నీలో ఆద్భుతంగా ఆడిన ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డును దక్కించుకున్నాడు
2018లో క్లబ్‌లో చేరిన ఎంబాపే.. PSG తరుపున 212 గోల్స్ సాధించాడు. క్లబ్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు.
ఎడిన్సన్ కవానీ 200 గోల్స్ తో రెండో స్థానం, ఇబ్రహిమోవిచ్ 156 గోల్స్ తో మూడో స్థానంలో నిలిచారు.2022-23 లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అతను వరుసగా ఐదుసార్లు లీగ్ గోల్డెన్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు.