Loading...
Tanvi Sharma: కొరియా మాస్టర్స్‌లో భారత షట్లర్ల జోరు.. క్వార్టర్‌ఫైనల్‌లోకి తన్వి శర్మ
కొరియా మాస్టర్స్‌లో భారత షట్లర్ల జోరు.. క్వార్టర్‌ఫైనల్‌లోకి తన్వి శర్మ

Tanvi Sharma: కొరియా మాస్టర్స్‌లో భారత షట్లర్ల జోరు.. క్వార్టర్‌ఫైనల్‌లోకి తన్వి శర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

కొరియా మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్వి శర్మ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తన్వి 21-16, 17-21, 21-13 తేడాతో భారత క్రీడాకారిణి శ్రియాన్షి వలిశెట్టిని ఓడించి ముందంజ వేసింది.

వివరాలు

అస్మిత, రక్షిత కూడా క్వార్టర్స్‌లోకి

భారత్‌కు చెందిన మరో ఇద్దరు షట్లర్లు అస్మిత చాలిహా, రక్షిత రామ్‌రాజ్ కూడా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు.

అస్మిత చాలిహా 21-17, 21-6తో ఆతిథ్య దేశమైన దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ జిపై సునాయాస విజయం సాధించింది.

రక్షిత రామ్‌రాజ్ కూడా ఆకట్టుకునే ఆటతో జపాన్ క్రీడాకారిణి మనామి సూజును 22-20, 21-10తో ఓడించి చివరి-8లో అడుగుపెట్టింది.

వివరాలు

ఇషారాణి, మాన్సీకి నిరాశ

అయితే భారత అయిదో సీడ్ ఇషారాణి బారువా మాత్రం పోరాడి ఓడిపోయింది. ఆమె 21-17, 18-21, 19-21తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సున్ చేతిలో పరాజయం పాలైంది.

మరో భారత షట్లర్ మాన్సీ సింగ్ కూడా చైనాకు చెందిన నాలుగో సీడ్ హాన్ కియాంక్షితో జరిగిన మ్యాచ్‌లో 12-21, 21-14, 17-21 తేడాతో ఓటమి చవిచూసింది.

పురుషుల డబుల్స్‌లో భారత జోడీకి విజయం

పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్-కృష్ణ ప్రసాద్ గరగ జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఈ భారత జంట 21-18, 21-19తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ యంగ్-షిన్ తే జోడీపై విజయం సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

డబుల్స్‌లో మరో రెండు జోడీలకు ఓటమి

మహిళల డబుల్స్‌లో సోనాలి సింగ్-రితిక థాకర్ జోడీ 15-21, 9-21తో జపాన్‌కు చెందిన సుమిరే నకాడె-మియు తకహసి జంట చేతిలో పరాజయం పాలైంది.

అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్-శ్రుతి మిశ్రా జోడీ కూడా పోరాడి ఓడింది.

ఈ భారత ద్వయం 16-21, 21-16, 13-21తో దక్షిణ కొరియాకు చెందిన తే యాంగ్-కిమ్ యు జంగ్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.

ADVERTISEMENT