
IPL 2023: ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై, లక్నో మధ్య బిగ్ ఫైట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 63వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫ్లే ఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
పాయింట్లపట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ముంబై, లక్నో జట్లు.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫ్లే ఆఫ్ లో అడుగుపెట్టాలని ఇరుజట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. రేపు లక్నోలోని బీఆర్ఎస్ఎబివి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మైదానంలో ఆరు మ్యాచులు జరగ్గా.. ముందు బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు విజయం సాధించాయి. అయితే గత సీజన్లో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. రెండింట్లోనూ లక్నోనే విజయం సాధించింది.
Details
ఇరు జట్లలోని సభ్యులు
ఈ మ్యాచ్ లో విజయం సాధించి, ఫ్లే ఆఫ్స్ లో నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. అయితే విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్ చరక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్.
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.