IPL 2023: ఫ్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఫ్లే అఫ్స్ కి అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరును చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. చైన్నై బ్యాటర్లలో గైక్వాడ్ 50 బంతుల్లో (3 ఫోర్లు, 7 సిక్సర్లు) 79 పరుగులు, డెవిన్ కాన్వే 52 బంతుల్లో (11 ఫోర్లు, 3 సిక్సర్లు) 87 పరుగులు, శివం దూబే 9 బంతుల్లో 22 పరుగులతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు ఫర్వాలేదనిపించాడు.
మూడు వికెట్లతో చెలరేగిన దీపక్ చాహర్
భారీ స్కోరును చేధించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అశించిన ఆరంభం దక్కలేదు. పృథ్వీషా(5), ఫిలిఫ్ సాల్ట్(3), రూసో(0) డకౌట్ తో తీవ్రంగా నిరాశపరిచారు. 26 పరుగులకే ఢిల్లీ 3 కీలక వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ విజయావకాశాలు ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 86 పరుగులు ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియానికి క్యూ కట్టడంతో ఢిల్లీ పరాజయం పాలైంది. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 77 పరుగులతో పరాజయం పాలైంది. చైన్నై బౌలర్లో దీపక్ చాహర్ 3 వికెట్లతో విజృంభించగా.. తీక్షణ, పతిరణ రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించారు.