LOADING...
IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత
ఐపీఎల్ లో వేగంగా 100 వికెట్లు తీసిన హర్షల్ పటేల్

IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. సోమవారం లక్నో‌తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ చివరి ఓవర్‌లో మార్క్‌వుడ్‌ను బౌల్డ్ చేయడంతో ఆ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. లక్నో, బెంగళూరు మ్యాచ్ చివరి బంతి ఉత్కంఠగా సాగింది. హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 48 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి గెలుపుపై అశలు రేకిత్తించిన హర్షల్ చివరి బంతికి పరుగు రావడంతో బెంగళూరు పరాజయం పాలైంది

హర్షల్ పటేల్

హర్షల్ పటేల్ సాధించిన రికార్డులివే

హర్షల్ పటేల్ 81 మ్యాచ్‌లో వేగంగా 100 వికెట్లను తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ పేరిట ఉంది. హర్షల్ RCB తరపున 69 మ్యాచ్‌లలో 22.12 సగటుతో 89 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా కూడా ఉన్నాడు. హర్షల్ 81 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23.23 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. అతను మూడుసార్లు నాలుగు వికెట్లు సాధించాడు. అతను 2021లో ఎంఐపై 5/27 విజృంభించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. అతను గత సీజన్‌లో కేకేఆర్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు