బెంగళూర్ బ్యాటర్ల ఊచకోత.. లక్నో ముందు భారీ స్కోరు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూర్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా విరాట్‌కోహ్లీ లక్నో బౌలర్లకు చుక్కులు చూపించారు. 44 బంతుల్లో (4 ఫోర్లు 4 సిక్సర్లు) 61 పరుగులు చేశాడు. అనంతరం అమిత్ మిశ్రా బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి స్టోయినిస్ క్యాచి ఇచ్చి కోహ్లీ వెనుతిరిగాడు. క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, డుప్లెసిస్‌తో జత కొట్టాడు. వీరిద్దరూ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించారు.
మాక్స్ వెల్, ఫాప్ డుప్లిసెస్ హాఫ్ సెంచరీ
మాక్స్ వెల్ 29 బంతుల్లో 59 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫాప్ డుప్లెసిస్ 48 బంతుల్లో 78 పరుగులతో విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి బెంగళూరు 212 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకటి, మార్క్ వుడ్ ఒక వికెట్ తీశారు