Page Loader
ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్
జైపూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న జోరూట్

ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు. ఐపీఎల్ వేలంలో ప్రతిసారీ పేరు రిజిస్టర్ చేయించుకోవడం, టెస్టు ప్లేయర్ కావడంతో జోరూట్ ని ఏ ఫ్రాంచేజీ కొనుగోలు చేయలేదు. అయితే ఎట్టకేలకు 2023 సీజన్లో జో రూట్ ని బేస్ ప్రైజ్ రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ప్రతి ప్లేయర్‌కి అవకాశం ఇవ్వడంలో ముందు ఉండే రాజస్థాన్ రాయల్స్.. జోరూట్‌ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. జైపూర్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న జోరూట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దీంతో మొదటి బంతికే కెమెరాను పగలు కొట్టాడు.

రాజస్థాన్ రాయల్స్

హిట్టర్లతో బలంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్

మార్చి 26, 2023 రాయల్‌గా జో రూట్ మొట్టమొదటి బాల్ ...' అంటూ నవ్వుతున్న ఎమోజీని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతేడాది గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సిమ్రాన్ హెట్మయర్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ సేన్, ఓబెడ్ మెక్‌కాయ్, యజ్వేంద్ర చాహాల్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్ వంటి ప్లేయర్స్ తో ఈసారి రాజస్థాన్ రాయల్స్ బలంగా ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రాక్టీస్ చేస్తున్న జో రూట్