Page Loader
IPL 2023: పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ షమీ
ఈ సీజన్ లో పవర్ ప్లేలో 8వికెట్లు తీసిన షమీ

IPL 2023: పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ షమీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ స్టార్ మహ్మద్ షమీ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవర్ ప్లేలో ప్రత్యర్థుల వికెట్లు తీస్తూ గుజరాత్ కు మంచి స్టార్ట్ ను అందిస్తున్నాడు. ఇప్పటివరకూ పవర్ ప్లేలో 22 ఓవర్లు షమీ 8 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా షమీ నిలిచాడు. బౌల్ట్, సిరాజ్ తలా ఏడు వికెట్లతో అతని తర్వాత స్థానంలో నిలిచారు. ముఖ్యంగా పవర్ ప్లేలో షమీ 6.63 తక్కువ రేటుతో పరుగులు ఇవ్వడం విశేషం.

Details

ఈ సీజన్ లో 100 డాట్ బాల్స్ వేసిన షమీ

ఐపీఎల్‌లో ఓవరాల్‌గా, షమీ పవర్‌ప్లేలో 7.41 మంచి ఎకానమీ రేటుతో 41 వికెట్లు పడగొట్టాడు. షమీ 101 మ్యాచ్‌ల్లో 8.44 ఎకానమీతో 112 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ సీజన్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా షమీకి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థులు పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. షమీ తన మునుపటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 3/33 రాణించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 100 డాట్ బాల్స్ వేసిన బౌలర్ కూడా షమీ రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సిరాజ్ 101 డాట్స్ వేసి అతని కంటే ముందు స్థానంలో నిలిచాడు.