IPL 2025: ఈ ఏడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం.. ఆ లోపల రిటెన్షన్ ప్లేయర్‌ల వివరాలు..
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)పై భారీ ఆసక్తి ఉంటుంది. సుమారు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీ..బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ బోర్డు)కు ఆటగాళ్లకు భారీ ఆదాయం తీసుకొస్తుంది. ఐపీఎల్ ఆటగాళ్ల పరిస్థితిని రాత్రి రాత్రికి మార్చే శక్తి కలిగి ఉంది.ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల కోసం జరిగే వేలం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. గత సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్,ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా రూ.24.75 కోట్లు,రూ.20.50 కోట్లు పొందడం గమనించదగ్గ విషయం. ఇక ఇప్పుడు 2025ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలమే నిర్వహించనున్నారంటే.. ఆసక్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ప్రపంచమంతా ఈ ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎదురుచూస్తుంటుంది.
మధ్యప్రాచ్యంలో వేలం నిర్వహించే అవకాశం
ప్రస్తుతం, ఐపీఎల్-18వ సీజన్ కోసం మెగా ఆక్షన్ నవంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మూడు లేదా నాలుగు వారాంతాలలో జరగవచ్చు అని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. గతసారిలా, ఈసారి కూడా వేలం విదేశాల్లోనే జరగవచ్చని సమాచారం. మధ్య ప్రాచ్య దేశాల్లో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఐపీఎల్ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో దుబాయ్‌లో జరిగినట్లుగా, ఈసారి దోహా లేదా అబుదాబిలో నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్,ఇతర క్రీడలపై ప్రాధాన్యం చూపిస్తున్న సౌదీ అరేబియా కూడా ఐపీఎల్ ఆక్షన్ హోస్టింగ్‌లో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వేదిక ఏది అనేది త్వరలో స్పష్టమవుతుంది.
రిటెన్షన్ రూల్స్‌పై ఫ్రాంఛైజీల మధ్య ఉత్కంఠ
ఐపీఎల్ వేలం తేదీ,సమయాన్ని పక్కన పెట్టి, రిటెన్షన్ రూల్స్‌పై ఫ్రాంఛైజీల మధ్య ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటీవలి ఐపీఎల్ పది జట్ల ఫ్రాంఛైజీలతో జరిగిన పాలక మండలి సమావేశం పూర్తి కావడం లేదు. రిటెన్షన్ పై ఏకాభిప్రాయానికి రాలేదు. వేలానికి ముందు, ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఎంత మంది ప్లేయర్లను retained చేసుకోవచ్చు, విదేశీ ప్లేయర్లు ఎంత మంది ఉండాలి, ఇంపాక్ట్ రూల్ తదితర అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, ఒక్కచోట ఒక నిర్ణయానికి రాకపోయింది.
నవంబర్ 15లోపు టీమ్స్ తమ రిటెన్షన్స్ ప్రకటించేందుకు డెడ్‌లైన్
మెగా వేలానికి ముందే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ అందాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు, ఈ నెల చివర్లో రిటెన్షన్ మార్గదర్శకాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుమారు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, నవంబర్ 15లోపు టీమ్స్ తమ రిటెన్షన్స్ ప్రకటించేందుకు డెడ్‌లైన్ పెట్టాలని ఐపీఎల్ మండలి భావిస్తోంది. అనంతరం, కొద్ది రోజుల్లోనే వేలం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.