Page Loader
MI vs RCB: హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!
హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!

MI vs RCB: హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్‌లో భారీ సెన్సేషన్ సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే చివరి ఓవర్ వరకూ టెన్షన్, డ్రామాతో నిండిన ఈ పోరులో ప్రేక్షకులు నరాలు తెగే ఉత్కంఠతో గడిపారు. చివరికి ఆర్సీబీ విజయం సాధించగా, కృనాల్ పాండ్యా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు తొలి బంతి నుంచే ఆగ్రెస్సివ్ మూడ్‌లో బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

భారీ షాట్లతో దాడి చేసిన ఆర్సీబీ బ్యాటర్లు 

ముంబై బౌలింగ్ యూనిట్ టాప్ క్లాస్‌గా ఉన్నా, ఆర్సీబీ బ్యాటర్లు భారీ షాట్లతో దాడి చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు నమోదు చేశారు. ఆ లక్ష్యాన్ని చేధించేందుకు ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది.మొదట మంచి ఆరంభం కనిపించినా,9 బంతుల్లో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మను యశ్ దయాల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ముంబై మొదటి ఎదురుదెబ్బను తగిలింది. అనంతరం విల్ జాక్స్ 22,ర్యాన్ రికెల్టన్ 17 పరుగులు మాత్రమే చేసి అవుటవ్వడంతో ముంబై 9.4 ఓవర్లలో 79/3గా నిలిచింది. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో కేవలం 26 పరుగులే చేయగలిగాడు.12 ఓవర్లు ముగిసేసరికి ముంబై 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది.

వివరాలు 

తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్

ఈ దశలో ఫ్యాన్స్ చాలా మంది మ్యాచ్‌ను చేజారినట్లుగానే భావించారు. కానీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచులో హై వోల్టేజ్ ఎనర్జీ తీసుకొచ్చాడు. అతనితో పాటు తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఒకదశలో విజయం ముంబైదే అనే స్థితి కనిపించింది. కానీ 29 బంతుల్లో 56 పరుగులు చేసిన తిలక్, 15 బంతుల్లో 42 చేసిన హార్దిక్ - ఇద్దరూ 18వ, 19వ ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు.

వివరాలు 

మ్యాచ్‌ను షేక్ చేసిన చివరి ఓవర్ 

ఆఖరి ఓవర్‌కు ముంబైకి ఇంకా 19 పరుగులు అవసరం.ఆ ఓవర్ బౌలింగ్ బాధ్యతను కృనాల్ పాండ్యా తీసుకున్నాడు,రజత్ పటిదార్ అతనికి బంతి అప్పగించాడు. మొదటి బంతికి మిచెల్ శాంట్నర్ ఆఫ్ సైడ్‌కి లిఫ్ట్ చేసిన బంతిని బౌండరీ వద్ద టిమ్ డేవిడ్ బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు. రెండో బంతిని దీపక్ చాహర్ గాల్లోకి లేపగా,డీప్ మిడ్ వికెట్ వద్ద ఫిల్ సాల్ట్,టిమ్ డేవిడ్ కలిసి క్యాచ్ పట్టారు. రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబైకు ఒత్తిడి పెరిగింది.మూడో బంతి వైడ్ అయినా, ఆ తర్వాత సింగిల్ మాత్రమే వచ్చింది. నాల్గవ బంతిని నమన్ ధీర్ బౌండరీకి తరలించాడు.

వివరాలు 

6 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా

ఇక రెండు బంతుల్లో 13 పరుగులు అవసరం. ఐదో బంతికి వచ్చిన ఫుల్ టాస్‌ను ధీర్ ఫైన్ లెగ్ మీదుగా హిట్ చేయగా, అక్కడ యశ్ దయాల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. చివరి బంతి డాట్ అయినందున ముంబై ఓటమిని చవిచూసింది. కృనాల్ పాండ్యా ఆ ఓవర్‌లో కేవలం 6 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి ఆర్సీబీకి గెలుపు అందించాడు. మొత్తం నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. ముంబై అభిమానులకు ఇది నిరాశ కలిగించినా, మొత్తం ఐపీఎల్ ప్రేక్షకుల కోసం మాత్రం ఇది థ్రిల్లింగ్ మ్యాచ్‌గా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడు కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా