LOADING...
IPL 2026: అజింక్య రహానే బ్యాటింగ్ స్టైల్‌పై విమర్శలు
అజింక్య రహానే బ్యాటింగ్ స్టైల్‌పై విమర్శలు

IPL 2026: అజింక్య రహానే బ్యాటింగ్ స్టైల్‌పై విమర్శలు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే తన బ్యాటింగ్ తీరుపై వచ్చిన విమర్శలకు స్పందించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో రహానే 10 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2023 నుంచి తన స్ట్రైక్ రేట్ రికార్డులతో తనకు తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు రహానే.

వివరాలు 

విమర్శలకు రహానే స్పందన ఇదే..

రహానే మాట్లాడుతూ.. తనకు 2023 నుంచి మంచి స్ట్రైక్ రేట్ ఉందన్నారు. కొంత మంది విమర్శకులు ఆటను అర్థం చేసుకోకుండానే, లేదా వ్యక్తిగత ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని, వారు తన ఆటను సరిగా అర్థం చేసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం రహానే మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రారంభం నుంచి మొదటి ఆరు ఓవర్లలో కనీసం 300 బంతులు ఎదుర్కొన్న ప్లేయర్లలో నాలుగో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ (167.78) రహానేకు ఉంది. అయితే పవర్ ప్లే తర్వాత, 7వ నుండి 15వ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌పై ఆయన స్ట్రైక్ రేట్ 114.02కి పడిపోతుంది. గురువారం జయదేవ్ ఉనడ్కట్ వేసిన బాల్‌కి రహానే అవుట్ అయ్యారు.

వివరాలు 

బ్యాటింగ్ సమస్యలపై చర్చ..

తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు రహానే తెలిపారు. తాను విజయాలు సాధించడం వారికి ఇష్టం లేనందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. తాను ఎలాంటి పరిస్థితులలో అయినా నిలకడగా ఉంటానని, విమర్శలు తనకు కొత్తేం కాదన్నారు. కోల్ కతా జట్టులో బ్యాటింగ్ సమస్యలను గుర్తించానని అన్నారు. 10 ఓవర్ల తర్వాత బౌలర్స్ ప్రదర్శనను ప్రశంసిస్తూ, వారు స్మార్ట్‌గా తిరిగి ఆడినట్లు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో తమే విజయం అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement