SRH : బ్యాటింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ పతనం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం 14.5 ఓవర్లలోనే 86 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన అత్యల్ప స్కోరుగా నమోదైంది. అంతేకాకుండా, 82 పరుగుల తేడాతో ఓడిపోవడం కూడా ఎస్ఆర్‌హెచ్‌కు పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిగా నిలిచింది. జట్టులోని బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 11 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 14 పరుగులు, సలీల్ అరోరా 16 పరుగులు, కెప్టెన్ పాట్ కమిన్స్ 19 పరుగులు మాత్రమే చేసి రెండంకెల స్కోరు నమోదు చేశారు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో సోషల్ మీడియాలో హైదరాబాద్ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
సన్‌రైజర్స్ ఫోన్ నంబర్ ఇదే.. 0, 6, 11, 9, 14, 16, 2, 4, 3..అంటూ ట్రో్ల్స్..
జట్టు స్కోర్‌బోర్డును ప్రస్తావిస్తూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. 0, 6, 11, 9, 14, 16, 2, 19, 4, 3 అనే స్కోర్లను చూపిస్తూ "ఇదే సన్‌రైజర్స్ ఫోన్ నంబర్" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన జట్టు బ్యాటర్లకు మద్దతుగా నిలిచాడు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. గుజరాత్ బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని ప్రశంసించాడు.
వివరాలు
అద్భుతమైన బౌలింగ్..
టీ20 క్రికెట్‌లో ఇదొక అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అని అభివర్ణించాడు. అలాగే, తమ జట్టులోని టాప్-4 బ్యాటర్లు ఈ సీజన్‌లో ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించారని గుర్తుచేశాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనందుకు వారిని తప్పుబట్టడం సరైంది కాదని చెప్పాడు. ఈ ఓటమిని వీలైనంత త్వరగా మరిచిపోయి మళ్లీ బలంగా తిరిగి వస్తామని పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.