LOADING...
IPL 2026: షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!
షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

IPL 2026: షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రెండు కీలక పోరులు అభిమానులను అలరించనున్నాయి. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మధ్య జరగనుంది. అనంతరం రాత్రి 7.30 గంటలకు రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చివరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయాయి. నేటి మ్యాచ్‌ల్లో మరోసారి ఓడిపోతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది.

వివరాలు

ఆ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం..

అదే సమయంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్లు పరాజయం పాలైతే వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా క్లిష్టంగా మారనున్నాయి. ఆర్‌సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసి నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌లో స్థానం ఖాయం చేసుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించాల్సి ఉంది. ముఖ్యంగా ముంబైపై గెలిస్తే జట్టులో ఉత్సాహం మరింత పెరుగుతుంది. అయితే ఓటమి ఎదురైతే వరుసగా మూడో పరాజయం నమోదు అవుతుంది. అప్పుడు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది. టాప్-2లో నిలవాలన్న ఆశలు కొనసాగాలంటే ఈ మ్యాచ్‌లో విజయం చాలా కీలకం.

వివరాలు

సీఎస్కేకు గట్టి పరీక్ష..

ఇక చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో సీఎస్‌కే ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలవాల్సిన అవసరం ఉంది. లక్నోపై విజయం సాధిస్తే ముందున్న మార్గం కొంత సులభమవుతుంది. కానీ ఓడిపోతే చివరి మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా మూడు విజయాలు నమోదు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. లక్నో, ముంబై జట్లు మాత్రం ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాయి.

Advertisement

వివరాలు

కోహ్లీ, రోహిత్ మధ్య పోటీ..

ఇక అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య పోటీ. టీమిండియా స్టార్ బ్యాటర్లు అయిన ఈ ఇద్దరు ఆదివారం ప్రత్యర్థులుగా తలపడనుండటంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 379 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ 5 మ్యాచ్‌ల్లో 221 పరుగులు చేసి తన బ్యాటింగ్ శక్తిని చాటుకున్నాడు. ఈరోజు అభిమానులను ఎక్కువగా అలరించేది ఎవరో చూడాలి. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement