LOADING...
IPL 2026 : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ కోసం పోరాడే నాలుగు జట్లు ఇవే!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ కోసం పోరాడే నాలుగు జట్లు ఇవే!

IPL 2026 : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ కోసం పోరాడే నాలుగు జట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసింది. ముంబయి ఇండియన్స్‌పై కీలక విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, టోర్నీలో నాల్గవ, చివరి ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ పోరుకు సిద్ధమైంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన అత్యంత కీలకమైన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో లీగ్ దశ ముగిసేసరికి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు అధికారికంగా ఖరారయ్యాయి.

వివరాలు

కీలక విజయాన్ని దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో పాటు, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తదుపరి దశకు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్‌తో ముంబై బ్యాటింగ్‌ను కట్టడి చేసి, ప్రత్యర్థిని 175 పరుగులకే పరిమితం చేశాడు. దీంతో రాజస్థాన్‌కు కీలక విజయం దక్కింది. రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలిసారి ప్లేఆఫ్స్ చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2022 తర్వాత మరోసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఈ జట్టు ముందుకు సాగుతోంది.

వివరాలు

ఓడిన జట్టుకు రెండో క్వాలిఫైయర్ రూపంలో మరో అవకాశం

మరోవైపు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు లభించనున్నాయి. ఈ రెండు జట్లు తొలి క్వాలిఫైయర్‌లో తలపడతాయి. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, ఓడిన జట్టుకు రెండో క్వాలిఫైయర్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ అన్ని నాకౌట్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Advertisement

వివరాలు

మొదటి క్వాలిఫైయర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ తేదీ: మే 26, మంగళవారం వేదిక: ధర్మశాల - హెచ్‌పీసీఏ స్టేడియం ఎలిమినేటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ తేదీ: మే 27, బుధవారం వేదిక: ముల్లాన్‌పూర్, న్యూ చండీగఢ్ - మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం రెండో క్వాలిఫైయర్ మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్ విజేత తేదీ: మే 29, శుక్రవారం వేదిక: ముల్లాన్‌పూర్, న్యూ చండీగఢ్ - మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం

Advertisement

వివరాలు

ఐపీఎల్ 2026 ఫైనల్

మొదటి క్వాలిఫైయర్ విజేత vs రెండో క్వాలిఫైయర్ విజేత తేదీ: మే 31, ఆదివారం వేదిక: అహ్మదాబాద్ - నరేంద్ర మోదీ స్టేడియం ఇక గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా బలమైన జట్టుగా కనిపిస్తోంది. రజత్ పటిదార్ సారథ్యంలో బెంగళూరు వరుసగా రెండోసారి ఫైనల్ చేరి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచాయి. ఈసారి బెంగళూరు ట్రోఫీని కైవసం చేసుకుంటే, ఆ అరుదైన ఘనత సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించనుంది.

Advertisement