Gujarat Titans: ఐపీఎల్ 2026 గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల జాబితా ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. ఇప్పుడు, 2026 వేలానికి ముందుగా జరగబోయే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ (నవంబర్ 15న) కోసం ఈ ఫ్రాంచైజీ సన్నద్ధమవుతోంది. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు జట్టుకు ప్రధాన స్తంభాలుగా కొనసాగుతారని అంచనా. దీంతో, తమ పర్స్ బ్యాలెన్స్‌ను సక్రమంగా ఉపయోగించుకుంటూ జట్టును మరింత బలపరచడానికి GT కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శించకపోవడం, పలు ట్రేడ్ పుకార్లు వినిపించడం వంటి కారణాలతో, మినీ వేలానికి ముందు గుజరాత్ కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వివరాలు
గుజరాత్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న మహ్మద్ సిరాజ్,కగిసో రబాడా
2025 సీజన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 15 మ్యాచ్‌ల్లో 50 సగటుతో, 155.88 స్ట్రైక్‌రేట్‌తో 650 పరుగులు సాధించి జట్టుకు కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు సాయి సుదర్శన్ స్థిరమైన ఫామ్‌లో ఉండగా, రషీద్ ఖాన్ తన మ్యాజిక్ స్పెల్స్‌తో జట్టుకు మ్యాచ్‌లను గెలిపించాడు. అదనంగా, విశ్వసనీయ బౌలర్లైన మహ్మద్ సిరాజ్, కగిసో రబాడాలను కూడా గుజరాత్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా, GT తమ వేలం వ్యూహంలో దేశీయ మరియు విదేశీ ఆటగాళ్ల మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
వివరాలు
సుందర్ గుజరాత్ జట్టులో ఒక కీలక భాగం
ట్రేడ్ విండో సమయంలో గుజరాత్ టైటాన్స్ చుట్టూ పలు ఆసక్తికర చర్చలు జరిగాయి. తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి తమ జట్టులో చేర్చుకోవాలన్న ఉత్సాహం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చూపినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ప్లేయర్ స్వాప్, ఆల్-క్యాష్ డీల్ వంటి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, గుజరాత్ వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుందర్ గుజరాత్ జట్టులో ఒక కీలక భాగంగా కొనసాగుతున్నాడు.
వివరాలు
గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకోబోయే, రిలీజ్ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు (అంచనా)..
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ రిటైన్డ్ ప్లేయర్స్: శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ , రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్. అర్షద్ ఖాన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, ఇషాంత్ శర్మ, రాహుల్ తెవాటియా, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్. గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ రిలీజ్డ్ ప్లేయర్స్: కుసల్ మెండిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, దసున్ షనక, గెరాల్డ్ కోయెట్జీ, గుర్నూర్ సింగ్ బ్రార్, కరీం జనత్, కుమార్ కుషాగ్రా, నిశాంత్ సింధు, జయంత్ యాదవ్.