IPL 2026 : కాటేరమ్మ కొడుకులు గెలిచారు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు సెట్ చేసిన 227 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ మలింగ్ ఒక్క ఓవర్‌లో సునీల్ నరైన్, రమణదీప్ సింగ్‌లను అవుట్ చేసి అభిమానులను షాక్‌కి గురి చేశాడు. ముందుగా, నితీష్ రెడ్డి రెండు ఓవర్లలోనే అనుకుల్ రాయ్, రింకూ సింగ్‌లను అవుట్ చేసి కోల్‌కతా దాడిని ఆపాడు. అంగక్రిష్ రఘువంశీ అర్ధశతకం సాధించి రనౌట్ అయ్యాడు. కామెరాన్ గ్రీన్ కేవలం రెండు పరుగులు చేసి, పవర్‌ప్లే చివరి బంతికి రనౌట్ అయ్యాడు.
వివరాలు
బౌలర్ల పోరాటం ఫలించింది..
ఫిన్ అలెన్ 28 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వెళ్ళగా, అతని వికెట్ హర్ష్ దుబే తీశాడు. కెప్టెన్ అజింక్య రహానే కూడా ఐదవ ఓవర్‌లో క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు. ముందుగా, ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. పవర్‌ప్లేలో హైదరాబాద్ 84 పరుగులు చేసింది, కానీ 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్ అర్ధశతకం సాధించి జట్టును 226 పరుగుల వద్ద నిలిపాడు. కోల్‌కతా తరఫున, బ్లెస్సింగ్ ముజరబాని నాలుగు వికెట్లు పడగొట్టాడు.
వివరాలు
జట్ల వివరాలివే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానె(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్.