
IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ!
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు తొమ్మిది రోజుల విరామానంతరం ఐపీఎల్ 2025 మళ్లీ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ప్రస్తుతం నాలుగు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం ఏకంగా ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కో జట్టు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం:
గుజరాత్ టైటాన్స్
మ్యాచ్‌లు : 11
విజయాలు : 8
ఓటములు : 3
పాయింట్లు : 16
నెట్ రన్ రేట్: +0.793
స్థానం : టేబుల్‌లో ప్రథమం
మిగిలిన మ్యాచ్‌లు : 3
ప్లేఆఫ్స్ ఛాన్స్ : ఒక్క విజయం చాలు. అప్పుడు 18 పాయింట్లు అవుతాయి. ప్లేఆఫ్స్ ఖాయం.
Details
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
మ్యాచ్‌లు : 11
విజయాలు : 8
ఓటములు : 3
పాయింట్లు : 16
నెట్ రన్ రేట్ : +0.482
స్థానం : రెండో స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 3
ప్లేఆఫ్స్ ఛాన్స్ : ఒక్క విజయం సరిపోతుంది. 18 పాయింట్లు చేసి ప్లేఆఫ్స్‌కు అడుగుపెడతారు.
పంజాబ్ కింగ్స్ (PBKS)
మ్యాచ్‌లు : 11
విజయాలు : 7
ఓటములు : 3
రద్దైన మ్యాచ్‌లు : 1
పాయింట్లు : 15
నెట్ రన్ రేట్ : +0.376
స్థానం : మూడవ స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 3
ప్లేఆఫ్స్ ఛాన్స్ : రెండు విజయాలు సాధిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లోకి. ఒక్క విజయం సాధించినా అవకాశాలు ఉన్నాయి.
Details
ముంబయి ఇండియన్స్ (MI)
మ్యాచ్‌లు : 12
విజయాలు : 7
ఓటములు : 5
పాయింట్లు : 14
నెట్ రన్ రేట్ : +1.156
స్థానం : నాలుగో స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 2
ప్లేఆఫ్స్ ఛాన్స్ : రెండు గెలిస్తే ఖాయం. ఒక్కటి గెలిచినా ఆశలు ఉన్నాయి, కానీ ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్ ప్రభావం చూపుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
మ్యాచ్‌లు : 11
విజయాలు : 6
ఓటములు : 4
రద్దైన మ్యాచ్‌లు : 1
పాయింట్లు : 13
నెట్ రన్ రేట్ : +0.362
స్థానం : ఐదో స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 3
ప్లేఆఫ్స్ ఛాన్స్ : కనీసం 2 మ్యాచ్‌లు గెలిస్తే 17 పాయింట్లు సాధించి అవకాశం ఉంది.
Details
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)
మ్యాచ్‌లు : 12
విజయాలు : 5
ఓటములు : 6
రద్దైన మ్యాచ్‌లు : 1
పాయింట్లు : 11
నెట్ రన్ రేట్ : +0.193
స్థానం : ఆరో స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 2
ప్లేఆఫ్స్ ఛాన్స్ : రెండు గెలిస్తేనే ఓ ఆశ. కానీ అదృష్టం తోడైతేనే టాప్ 4లోకి ఎంట్రీ ఉంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
మ్యాచ్‌లు : 11
విజయాలు : 5
ఓటములు : 6
పాయింట్లు : 10
నెట్ రన్ రేట్ : -0.469
స్థానం : ఏడవ స్థానం
మిగిలిన మ్యాచ్‌లు : 3
ప్లేఆఫ్స్ ఛాన్స్ : మూడూ గెలిస్తే 16 పాయింట్లు. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.