ICC Mens T20 World Cup: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం.. ఒమన్ ఘోర ఓటమి!
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ క్రికెట్ జట్టు 96 పరుగుల భారీ తేడాతో ఒమెన్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు ఐర్లాండ్ బౌలర్ల దాడిని ఎదుర్కోలేక తడబడింది. 18 ఓవర్లలోనే 139 పరుగులకు ఆలౌటైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, హమ్మద్ మీర్జా 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 పరుగులు చేసి ప్రతిఘటించారు.
Details
విఫలమైన బ్యాటర్లు
అయితే మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ హంఫ్రీస్, బారీ మెక్‌కార్తీ తలో రెండు వికెట్లు తీసుకోగా, జార్జి డాక్రెల్ ఒక వికెట్‌తో సంతృప్తి చెందాడు.