LOADING...
Smriti Mandhana; ప్రాక్టీస్ సమయంలో ఇరిటేషన్‌.. స్మృతి మంధాన-కెమెరామెన్‌ ఘటన హాట్‌ టాపిక్
ప్రాక్టీస్ సమయంలో ఇరిటేషన్‌.. స్మృతి మంధాన-కెమెరామెన్‌ ఘటన హాట్‌ టాపిక్

Smriti Mandhana; ప్రాక్టీస్ సమయంలో ఇరిటేషన్‌.. స్మృతి మంధాన-కెమెరామెన్‌ ఘటన హాట్‌ టాపిక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌ శుక్రవారం నవీ ముంబయిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా, ఓ కెమెరామెన్‌ ఆమెను అతి దగ్గర నుంచి చిత్రీకరించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో స్మృతి 'ఏంటిది?'అంటూ అతడిని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియోను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.

Details

ముంబైపై ఆర్సీబీ గెలుపు

ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పొయిది 13 బంతుల్లో 18 ప‌రులు చే సి ఔట్ అయింది. టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబయి జట్టు 154 పరుగులు చేసింది. లక్ష్యంతో ఛేదనకు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నదైన్‌ (63*; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 157పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో WPL 2026 సీజన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయంతో ప్రారంభించినట్లైంది

Advertisement