IND vs WI: మ్యాచ్ మధ్యలో లేజర్ షో అవసరమా? సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అసంతృప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మెన్ టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పవర్‌ప్లే ముగిసిన వెంటనే షెడ్యూల్ ప్రకారం మూడు నిమిషాల విరామం ఇచ్చారు. అప్పటికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఈ విరామ సమయంలో స్టేడియంలోని లైట్లను పూర్తిగా ఆర్పేసి లేజర్ షో నిర్వహించారు. ఈ వ్యవహారంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆట మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమా అని వారు ప్రశ్నించారు.
Details
కంటిచూపుపై ప్రభావం చూపే అవకాశం
ఇది బ్యాటర్ల ఏకాగ్రతతో పాటు కంటి చూపుపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కామెంట్రీ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ, "రెండున్నర నుంచి మూడు నిమిషాల డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షో నిర్వహించడం బ్యాటర్లకే కాదు, ఎవరికైనా మంచిది కాదు. అది కంటి చూపును దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో లేజర్ షో నిర్వహించడం వరకు ఓకే. కానీ నాకౌట్ మ్యాచ్‌ల్లో, అదీ డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. ఇది ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.