Smriti Mandhana-Palak: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ వివాదం లీక్.. స్క్రీన్‌షాట్‌లు వైరల్.. పెళ్లి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన (29),సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (30) వివాహం వాయిదాపడిన విషయం తెలిసిందే. మొదటగా, నవంబర్ 23న మహారాష్ట్ర సాంగ్లి ప్రాంతంలో జరగాల్సిన పెళ్లి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్య కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలూ సోషల్ మీడియాలో తెలియజేశారు. శ్రీనివాస్ గుండె సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు పలాశ్, మంధాన కుటుంబాలు పేర్కొన్నారు. అయితే తాజాగా మరో షాకింగ్ వార్త వెలువడింది. సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి, వీటిలో పలాశ్ మంధానను మోసం చేశాడని సూచిస్తున్నారు.
వివరాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా స్క్రీన్‌షాట్‌లు
పలాశ్ ముచ్చల్ మరియు మరో మహిళ మధ్య జరిగిన చాట్‌ల స్క్రీన్‌షాట్‌లు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా ఈ స్క్రీన్‌షాట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తరువాత ఇవి రెడ్డిట్‌లో కూడా షేర్ అయ్యాయి. ఈ స్క్రీన్‌షాట్‌లలో, 2025 మే నెలలో ఆ మహిళను పలాశ్ ఈతకు ఆహ్వానించినట్లు, అలాగే మంధానతో తన రిలేషన్ పాతబడిందని, తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా ఆ మహిళను పలాశ్ కోరాడు. అదనంగా, మంధాన గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా సమాచారం. ఈ చాట్ విషయాలు పెళ్లికి కొద్ది గంటల ముందు వెలుగులోకి రావడంతో మంధాన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఫలితంగా, పెళ్లి వాయిదా పడింది.
వివరాలు
పలాశ్ కూడా ఆసుపత్రిలో..
వైరల్ అయిన స్క్రీన్‌షాట్‌ల కారణంగా మంధాన తండ్రి పలాశ్ ముచ్చల్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని, ఆ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పెళ్లి వాయిదా అనంతరం పలాశ్ కూడా ఆసుపత్రిలో చేరాడు. మరోవైపు, మంధాన తన నిశ్చితార్థ ఫోటోలు, ప్రపోజల్ వీడియోలు సహా అనేక పోస్టులను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు. దీనివల్ల, స్క్రీన్‌షాట్‌లలో ఉన్న విషయాలు నిజమే అని నెటిజన్లు భావిస్తున్నారు. తాజా పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే, మంధాన స్వయంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం, మంధాన, పలాశ్ 2019 నుండి డేటింగ్‌లో ఉన్నారని తెలిసిందే.