LOADING...
T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!

T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ సూపర్ 8దశ ఆశించిన విధంగా ఆరంభం కాలేదు. శనివారం జరగాల్సిన పాకిస్తాన్-న్యూజిలాండ్ తొలి సూపర్ 8 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది. టాస్ పూర్తైన తర్వాత భారీ వర్షంతో ఆట కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మిగతా మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందేమోనన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 22) రెండు కీలక పోరులు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఇంగ్లాండ్ జట్లు తలపడుతుండగా, ఫ్లడ్‌లైట్ల కాంతిలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. సెమీఫైనల్ రేసులో ముందడుగు వేయాలంటే ఈ పోరు ఇరు జట్లకూ అత్యంత కీలకం.

Details

వాతావరణ పరిస్థితులు

ఓటమి పాలైన జట్టు నాకౌట్ అవకాశాలు సంక్లిష్టమయ్యే పరిస్థితి ఉంది. అందుకే విజయం కోసం రెండు జట్లు శక్తిమేర పోరాడే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం దాదాపు లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. టాస్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు, మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మైదానం పరిసరాల్లో ఉష్ణోగ్రత 24 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. తేమ శాతం 40%కు పైగా ఉండొచ్చని అంచనా. మొత్తంగా చూస్తే ఆటకు అనుకూల వాతావరణమే నెలకొననుంది.

Details

పిచ్ రిపోర్ట్

నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మైదానం విస్తీర్ణం పెద్దగా ఉండటంతో బౌండరీలు, సిక్సర్లు సాధించాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం సులభమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రివేళల్లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టసాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement