MS Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్..? టీ-షర్ట్‌తో క్లూ.. నెట్టింట హాట్ టాపిక్..!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ధోనీ 'డెన్' చేరుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.
అయితే, ఈ సీజన్ ధోనీకి చివరిదా? అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
ధోనీ తన టీ-షర్ట్ ద్వారా ఇదే తన చివరి ఐపీఎల్ అనే సంకేతం ఇచ్చాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.
టీ-షర్ట్పై రహస్య సందేశం?
ఐపీఎల్ కోసం చెన్నైకి వచ్చిన ధోనీ, విమానాశ్రయంలో కనిపించినప్పుడు ఆయన ధరించిన టీ-షర్ట్‌పై అందరి దృష్టి పడింది.
ఆ డిజైన్‌లో మోర్స్ కోడ్ ఉందని, దానికి అర్థం 'చివరిసారి' అని అభిమానులు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
Details
ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న ధోనీ
ఇటీవల ధోనీ జియో హాట్‌స్టార్‌లో సన్నీ డియోల్‌తో కలిసి చాంపియన్స్ ట్రోఫీ భారత్-పాక్ మ్యాచ్ వీక్షించాడు.
ఐపీఎల్‌లో ఆడేందుకు ఏడాదికి కొన్ని నెలలు మాత్రమే కష్టపడతానని ధోనీ చెప్పాడు. అయితే, ఈసారి మరింత కఠినమైన ప్రిపరేషన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
ధోనీ తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ, ఐపీఎల్ అత్యంత క్లిష్టమైన టోర్నీల్లో ఒకటని, ఎవరూ మీ వయసును పట్టించుకోరని, అయితే లీగ్ స్థాయిని తగ్గించకూడదని చెప్పాడు.
తన శారీరక, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడూ శ్రమిస్తానని వివరించాడు.
ధోనీ టీ-షర్ట్ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ లేదా ధోనీ నుంచి అధికారిక స్పందన రాలేదు.
అభిమానులు మాత్రం ఆయన చివరి సీజన్ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.