Ishan Kishan: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇషాన్ కిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఇషాన్ తాత 'రామ్ అనుగ్రహ పాండే' మోడల్ 'అదితి హుండియా'తో ఇషాన్ వివాహం జరగొచ్చని సూత్రప్రాయంగా చెప్పాడు. జైపుర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అదితి 2019 నుండి ఇషాన్ కిషన్‌తో స్నేహం కొనసాగిస్తోంది. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదితి ఇషాన్‌ను ప్రోత్సహిస్తూ స్టేడియంలో తరచూ కనిపిస్తుంది. తనకు ఇష్టమైన అమ్మాయిని ఇషాన్ పెళ్లి చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి జైపుర్‌కు చెందిన మోడల్, మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిందని తాత పాండే తెలిపారు.
Details
ప్రస్తుతం రాంచీలో స్థిరపడిన ఇషాన్ కుటుంబం
ఇషాన్ కుటుంబం బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా దౌద్‌నగర్ బ్లాక్ పరిధిలోని గోడిహా గ్రామం స్వస్థలం. ప్రస్తుతం ఇషాన్ కుటుంబం రాంచిలో స్థిరపడింది. అయితే తాత 'పాండే' ఇంకా సొంత గ్రామంలోనే వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. ఇషాన్ తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి తాతతో చర్చిస్తుంటాడని పాండే చెప్పారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు కూడా మనవడితో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ ప్రస్తుతానికి ఇషాన్ వివాహం గురించి ఎటువంటి అధికారిక చర్చలు లేవని అతని తల్లి 'సుచిత్ర సింగ్' తెలిపారు.