
ISL: ఇండియన్ సూపర్ లీగ్‌లో ఛెత్రి ఫ్రీకిక్‌పై దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్‌పై బెంగళూర్ ఎఫ్‌సి విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్‌ను బెంగళూర్ ఎఫ్‌సి చిత్తు చేసింది. బెంగళూర్ ఎఫ్‌సీ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన గోల్ తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో కేరళ బ్లాస్టర్స్ మైదానం నుంచి వాకౌట్ చేశారు.
ప్రత్యర్థి ఆటగాళ్లు సిద్ధం కాకముందే ఫ్రీకిక్ ను గోల్‌గా మలిచిన ఛెత్రి వివాదానికి కేంద్రంగా మారాడు. ఆ గోల్ సరైందని రీఫరీ నిర్ధారించగా.. కేరళ బ్లాస్టర్ ఆటగాళ్లు నిస్సహాయంగా ఉండిపోయారు. రీఫరి నిర్ణయంపై వారు విభేదించి మైదానాన్ని వీడారు. దీంతో కేరళ బ్లాస్టర్ మ్యాచ్ ను కోల్పోయింది.
ఛైత్రి
విజిల్ వేయకముందే ఛైత్రి గోల్ కొట్టాడు
97వ నిమిషంలో సాధించిన ఈ గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి బెంగళూరు వెళ్లింది. రిఫరీ విజిల్ వేయకముందే ఛైత్రి గోల్ కొట్టాడు. దీనిపై కేరళ బ్లాస్టర్ రిఫరీని అశ్రయించారు. రిఫరీ కూడా ఈ గోల్ సరైందంటూ వెల్లడించడంతో కేరళ బ్లాస్టర్ ఆటగాళ్లు నిరాశ చెందారు. ఈ మ్యాచ్ విజయంతో సెమీస్ కు వెళ్లిన బెంగళూరు.. తరువాత ముంబాయి సీటీతో తలపడనుంది.
IFAB చట్టం 13.3 ఒక ఆటగాడు ఫ్రీకిక్‌ను త్వరగా తీసుకున్నప్పుడు తక్కువ దూరంలో ఉన్న ప్రత్యర్థి దానిని అడ్డగిస్తే రిఫరీ ఆటను కొనసాగించడానికి అనుమతి ఇస్తాడు. ఫ్రీకిక్‌ను త్వరగా తీసుకోకుండా ప్రత్యర్థి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఆటను కొనసాగించడానికి వీలుండదు.