LOADING...
Jasprit Bumrah: అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ
అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ

Jasprit Bumrah: అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
09:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు.

వివరాలు 

ఢిల్లీపై బుమ్రా రికార్డ్ 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై బుమ్రా ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడి మొత్తం 30 వికెట్లు తీశాడు. అతని సగటు 21.73గా ఉంది. ఒకసారి నాలుగు వికెట్లు తీసిన ప్రదర్శన కూడా అతని ఖాతాలో ఉంది. ముఖ్యంగా ఢిల్లీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఢిల్లీ వేదికగా ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు సాధించాడు. ఇక్కడ అతని సగటు 38.14 కాగా, ఎకానమీ రేటు 9.53గా ఉంది.

వివరాలు 

ఐపీఎల్‌లో రికార్డుల మోత..

మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో బుమ్రా 146 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు సాధించాడు. అతని సగటు 22.21గా ఉండగా, ఎకానమీ రేటు 7.25గా ఉంది. మూడు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించాడు. ఈసారి బుమ్రా మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది.

Advertisement