Page Loader
Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా

Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2024
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ధృవీకరించారు. భారత్-ఇంగ్లండ్‌ల మధ్య రాజ్‌కోట్‌లో జరగనున్న టెస్టుకు ముందు ఫిబ్రవరి 14న బుధవారం నిరంజన్ షా స్టేడియంను జేషా ఆవిష్కరించారు. 2023 ODI ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి మనం హృదయాలను గెలుచుకున్నామని అన్నారు. బార్బడోస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 T20 ప్రపంచ కప్‌ గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది" అని జేషా వెల్లడించారు. స్టేడియం ప్రారంభానికి నిరంజన్ షా,మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్ హాజరయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్‌కోట్‌లో ఈవెంట్ లో మాట్లాడుతున్న జేషా