LOADING...
Jemimah Rodrigues: స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్‌కు దూరం!
స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్‌కు దూరం!

Jemimah Rodrigues: స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్‌కు దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ సీజన్‌లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోవడం ఖాయమైంది. సహచర క్రీడాకారిణి 'స్మృతి మంధాన' కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆమె భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని తమ ఫ్రాంచైజీ గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ అధికారికంగా ప్రకటించింది. సుమారు పది రోజుల క్రితం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జెమీమా, స్మృతి మంధాన వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్‌కు చేరుకుంది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో పెళ్లి వేడుకలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ క్లిష్ట సమయంలో స్మృతి కుటుంబానికి అండగా ఉండేందుకు భారత్‌లోనే కొనసాగాలని జెమీమా నిర్ణయించింది

Details

జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ 'గ్రేస్ హారిస్'

. ఆమె నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్ హీట్ సీఈఓ 'టెర్రీ స్వెన్సన్' మాట్లాడుతూ జెమీమా ప్రస్తుతం ఒక క్లిష్టమైన వ్యక్తిగత పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఆమె మళ్లీ డబ్ల్యూబీబీఎల్‌కు చేరలేకపోయినా, భారత్‌లోనే ఉండటాన్ని మేము అంగీకరించాం. తిరిగి ఆడలేకపోవడం పై ఆమె కూడా నిరాశ వ్యక్తం చేసింది. క్లబ్‌కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మిగిలిన మ్యాచ్‌లకు జట్టుకు శుభాకాంక్షలు తెలిపిందని తెలిపారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బ్రిస్బేన్ హీట్, రాబోయే శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడనుంది. జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ 'గ్రేస్ హారిస్' జట్టులోకి తిరిగి రాబోతుంది.

Advertisement