Joe Root: రికీ పాంటింగ్ సరసన నిలిచి టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన సెంచరీతో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో శతకం కావడం విశేషం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జో రూట్, రెండో రోజు ఆటలో శతకాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు 216 బంతుల్లో 15 ఫోర్లతో 146 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. ఈ సెంచరీతో జో రూట్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Details
మూడోస్థానంలో జో రూట్
ఇది అతడికి 41వ టెస్ట్ సెంచరీ కాగా, ఈ విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. పాంటింగ్ 168 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా, జో రూట్ కేవలం 163 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అలాగే 2026 క్యాలెండర్ ఇయర్‌లో రూట్‌కు ఇది తొలి సెంచరీ కావడం కూడా విశేషమే. టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో జో రూట్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి కంటే ముందు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ జాక్వస్ కలీస్ (166 మ్యాచ్‌ల్లో 45 సెంచరీలు) ఉన్నాడు.
Details
అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్
అగ్రస్థానంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (200 మ్యాచ్‌ల్లో 51 సెంచరీలు) నిలిచాడు. ఇదిలా ఉండగా 211/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, ప్రస్తుతం 86 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.