Loading...
Dhruv Jurel: వికెట్ల వెనుకే కాదు.. కాఫీ మెషీన్‌ ముందు కూడా జురెల్‌ అదుర్స్
వికెట్ల వెనుకే కాదు.. కాఫీ మెషీన్‌ ముందు కూడా జురెల్‌ అదుర్స్

Dhruv Jurel: వికెట్ల వెనుకే కాదు.. కాఫీ మెషీన్‌ ముందు కూడా జురెల్‌ అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా మందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కాఫీ తాగకుండా రోజు గడవదనుకునేవారు కూడా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగి తమ రోజును ప్రారంభిస్తారు. కాఫీ రుచిని ఆస్వాదించడంతో పాటు.. స్వయంగా కాఫీ తయారు చేయడంలోనూ కొంతమంది ఆసక్తి చూపుతుంటారు. మన టీమిండియా వికెట్‌ కీపర్‌ ధ్రువ్ జురెల్‌ కూడా కాఫీ ప్రియుడే. కాఫీని ఎంతో ఇష్టంగా సిప్‌ చేసే జురెల్‌.. తరచూ కాఫీ తయారు చేస్తుంటారు. కాఫీ చేయడమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అంతేకాదు.. అది ఆయనకు సరదా కూడా. ఇటీవల ధ్రువ్ జురెల్‌ కాఫీ తయారు చేస్తుండగా.. ఆస్ట్రేలియన్ కాఫీ ఆంత్రప్రెన్యూర్‌, బరిస్తా కిర్క్ పియర్సన్‌ వీడియో తీశారు.

వివరాలు

కాఫీ తయారు చేస్తూ కనిపించిన జురెల్

అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ధ్రువ్ జురెల్‌ ఓ కాఫీ మెషీన్‌ పక్కన నిలబడి కాఫీ తయారు చేస్తూ కనిపించారు.

కాఫీ మెషీన్‌ నుంచి కాఫీకి అవసరమైన పదార్థాలను తీసుకోవడం, కాఫీని కప్పులో పోయడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కాఫీ చేస్తున్న ప్రతి క్షణాన్ని ధ్రువ్ జురెల్‌ ఆస్వాదించారని కిర్క్ పియర్సన్‌ తెలిపారు.

కాఫీపై వేడినీళ్లు పోయడం, ఓ ఆకారం వచ్చేలా డిజైన్‌ వేయడం వంటి పనులను కూడా జురెల్‌ చేశారు. అలాగే వివిధ రకాల కాఫీలను కూడా ప్రయత్నించారు.

కాఫీ తాగడమే కాకుండా.. కాఫీ తయారు చేయడమంటే కూడా ధ్రువ్ జురెల్‌కు ఎంత ఇష్టమో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందని కిర్క్ పియర్సన్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT