ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. అందుబాటులో స్టార్ ప్లేయర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 ఎడిషన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. చాలామంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఫ్రాంచైజీల్లో అందోళన మొదలైంది. తాజాగా కొన్ని టీంలకు గుడ్ న్యూస్ అందింది. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా నలుగురు స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేయలేదు. దీంతో వారు ఐపీఎల్ లో పాల్గొనే అవకాశం లభించింది. టీమ్ సౌతీ, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్ ఐపీఎల్‌లో ఆడేందుకు వీలుగా మరో ముగ్గురు ఆటగాళ్లను కూడా బోర్డు విడుదల చేసింది. న్యూజిలాండ్ వన్డే కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనున్నారు.
గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడనున్న కేన్ విలియమ్సన్
రూ.2 కోట్ల బేస్ ధరతో కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. మరోవైపు డెవాన్ కాన్వే, మిచెల్ స్నాంటర్ చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడనున్నారు. టీమ్ సౌథీ ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడున్నారు. లాకీ ఫెర్గూసన్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ లంకతో తొలి వన్డేని మార్చి 25న ఆడనున్నారు. ఇక లాకీ ఫెర్గూసన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగంగా బరిలోకి దిగనున్నారు.