NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 5 వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీశాడు. అయితే రెండో రోజు బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 162/5 స్కోరు చేసింది. కివీస్ బ్యాటర్లు టామ్ లాథమ్ (67), డెవాన్ కాన్వే (30), డారిల్ మిచెల్ (40*) పరుగులు చేశారు. లాథమ్, మిచెల్ 58 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పారు.
శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, అసిత ఫెర్నాండో చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 193 పరుగుల వెనుకంజలో ఉంది
సౌథీ
కివీస్ కెప్టెన్ సౌథీ అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ సౌథీ అరుదైన ఫీట్‌ను సాధించాడు. మాజీ స్పిన్నర్ డేనియల్ వెట్టోరీ రికార్డును బద్దలు కొట్టాడు. సౌతీ 354 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 708 వికెట్లు తీయగా.. వెట్టోరి తన అంతర్జాతీయ కెరీయర్లో 705 వికెట్లతో తీశాడు.
రైట్ ఆర్మ్ పేసర్ మాట్ హెన్రీ 20 టెస్టుల్లో 38.69 సగటుతో 65 వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ 73 టెస్టుల్లో 5,105 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి.
తొలి టెస్టులో శ్రీలంక జట్టు, న్యూజిలాండ్‌ని ఓడిస్తే... టీమిండియా ఫైనల్ చేరేందుకు రెండో టెస్టు ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది