Page Loader
టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ రికార్డు.. ఒక పరుగు తేడాతో విజయం
ఒక పరుగు తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్

టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ రికార్డు.. ఒక పరుగు తేడాతో విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

బజ్‌బాల్ విధానంతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు టెస్టులో మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 258 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కివిస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువును నిలబెట్టుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. చివర్లో బెన్‌స్టోక్స్ 33 పరుగులు, బెన్‌ఫోక్స్‌లు 35 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ విజయం దిశగా వెళ్లింది. ఈ క్రమంలో కివీస్ బౌలర్లు సౌథీ, వాగ్నర్ స్వల్ప వ్యవధిలో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. విజయానికి ఒక పరుగు కావాల్సిన దశలో అండర్స్‌వాగ్నర్ బౌలింగ్‌లో ట్యామ్ బండెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.

రూట్,

సెంచరీలతో రాణించిన రూట్, హ్యారీ బ్రూక్

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రూట్ (153*), హ్యారీ బ్రూక్ (186) సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడించింది అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో​ మెరవడంతో న్యూజిలాండ్ 483 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌ ముందు 258 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఉంచగలిగింది.