Page Loader
డేనియల్ వెటోరీని దాటేసిన కివీస్ కెప్టెన్ టీమ్ సౌథీ
డేనియల్‌ వెటోరీ రికార్డును బద్దలు కొట్టిన టీమ్ సౌథీ

డేనియల్ వెటోరీని దాటేసిన కివీస్ కెప్టెన్ టీమ్ సౌథీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో 5వికెట్లు పడగొట్టిన సౌథీ న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా సౌతీకి ఇదే తొలి ఐదు వికెట్లు కావడం గమనార్హం. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక బ్యాటర్లు కుసాల్ మెండిస్ (87), ధనంజయ డిసిల్వా (46), దినేష్ చండిమాల్ (39) రాణించడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరును చేసింది.

టీమ్ సౌథీ

మొదటి స్థానానికి ఎగబాకిన సౌథీ

డేనియల్‌ వెటోరీ 112 టెస్ట్‌ల్లో 361 వికెట్లు తీశాడు. ప్రస్తుతం సౌథీ 93 టెస్టుల్లో 364 వికెట్లు పడగొట్టి మొదటి స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రిచర్డ్ హ్యాడ్లీ 431 వికెట్లు తీసి మొదటి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (685) పేరిట ఉంది. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్‌ (578), కెయిన్స్‌ (419), మిల్స్‌ (327), మోరిసన్‌ (286), చాట్‌ఫీల్డ్‌ (263), బాండ్‌ (259), వాగ్నర్‌ (258) టాప్‌-10లో ఉన్నారు.