NZ vs SL: సెంచరీతో న్యూజిలాండ్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఐదో రోజు అజేయ శతకం బాదిన కేన్ విలియమ్సన్ శ్రీలంకపై న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 177 బంతుల్లో సెంచరీ చేసి, టెస్టులో తన 27వ సెంచరీని కేన్ విలియమ్సన్ నమోదు చేశాడు. న్యూజిలాండ్ విజయానికి 257 పరుగులు అవసరం కాగా.. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ (81) అద్భుత పోరాటంతో కివీస్ విజయం సాధించింది. టెస్టుల్లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేన్ విలియమ్సన్ నిలిచాడు. 93 టెస్టులు ఆడి 53.8 సగటుతో 7909 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలున్నాయి.
విలియమ్సన్ సాధించిన రికార్డులివే
టెస్టుల్లో సెంచరీల పరంగా విలియమ్సన్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్‌లను రికార్డులను సమం చేశాడు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ (28), ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ (29), ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (30) మాత్రమే ఎక్కువ టెస్టు శతకాలు సాధించి, విలియమ్సన్ కంటే ముందు స్థానంలో ఉన్నారు. శ్రీలంకపై 11 టెస్టులో 65-ప్లస్ సగటుతో 1,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా విలియమ్సన్ నిలిచాడు. అతని కంటే ముందు టామ్ లాథమ్ (1,019), స్టీఫెన్ ఫ్లెమింగ్ (1,166) పరుగులు చేశారు. విలియమ్సన్ శ్రీలంకపై నాలుగు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు