Page Loader
Paralympics 2024: పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్‌
పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్‌

Paralympics 2024: పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన 25వ పతకాన్ని సాధించింది. ఇందులో పురుషుల జూడోలో భారత్ తొలి పతకం నెగ్గింది. 60 కేజీల జే1 విభాగంలో భారత పారా అథ్లెట్ కపిల్ పార్మర్ అద్భుత ప్రదర్శనతో కాంస్యం గెలిచాడు. బ్రెజిల్‌కు చెందిన డి ఒలివెరాతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ కేవలం 33 సెకన్లలోనే అతనిని మట్టికరిపించాడు. "ఇప్పాన్" విధానం ద్వారా ప్రత్యర్థిని పైన పడేసి విజయం సాధించి, జూడోలో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

వివరాలు 

2018 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో విజేత

కపిల్ పార్మర్ జీవితం కఠిన పరిస్థితుల్లో సాగింది.అతడికి కంటిచూపు చాలా స్వల్పంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన అన్నలతో కలిసి ఆటలాడుతూ,జూడో క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. కానీ, 9ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదంలో విద్యుదాఘాతంతో కోమాలోకి వెళ్లాడు. ఆ ప్రమాదం అతని చూపును దెబ్బతీసింది,కానీ అతని సంకల్పాన్ని మాత్రం కాదు. కపిల్ కష్టాలను అధిగమించి, 2018 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు, 2019 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచాడు. తాజాగా,పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకంతో అతడు మరో ఘనత సాధించాడు. అయితే, పారాలింపిక్స్‌లో అంధుల జూడోలో క్రీడాకారులు సహాయక సిబ్బంది సాయంతో మ్యాట్‌పైకి ప్రవేశిస్తారు. రిఫరీ ఇద్దరి చేతులు ఒకరిని ఒకరు పట్టుకునేలా చేస్తాడు. ఆ తర్వాత వారు పోరాటాన్ని ప్రారంభిస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంస్యం గెలిచిన కపిల్‌