Official Laws of Cricket: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌లో బ్యాట్, బంతి మధ్య సమతుల్యతను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని మరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) హెడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రేసర్ స్టీవార్ట్ తెలిపారు. ఈ సమతుల్యతను కాపాడేందుకు ఎంసీసీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్త క్రికెట్ నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన అంపైర్ల వర్క్‌షాప్‌లో స్టీవార్ట్ మాట్లాడారు. ఈ సందర్భంగా క్రికెట్ నియమావళిలో దాదాపు 73 నిబంధనలను సవరించినట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా చేసిన మార్పుల్లో కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు ఎర్రబంతి ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వికెట్ పడితే.. ఆ ఓవర్‌లో మిగిలిన బంతులను ఎదుర్కొనేందుకు తదుపరి బ్యాటర్ తప్పనిసరిగా మైదానంలోకి రావాల్సి ఉంటుంది.
వివరాలు
క్రికెట్ నియమాలపై మరింత అవగాహన
కొత్త నిబంధనలపై ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర క్రికెట్ వర్గాల్లో అవగాహన పెంచేందుకు ఎంసీసీ 'అఫీషియల్ లాస్ ఆఫ్ క్రికెట్' పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
ఈ యాప్‌ను పలు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగువాడైన శ్రీకాంత్ టంగుటూరికి చెందిన రీబుల్ సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది.
అంతేకాకుండా కొత్త క్రికెట్ నియమాలపై మరింత అవగాహన కల్పించేందుకు అక్టోబరు మొదటి వారంలో పలు నగరాల్లో ఎంసీసీ సెమినార్లను కూడా నిర్వహించనుంది.