#Viral Moment: విరాట్‌ని రెచ్చగొట్టిన ఖలీల్ అహ్మద్.. చివరికి రివేంజ్ తీసుకున్న కింగ్ కోహ్లీ! (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొదట్లో చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ తన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరాట్ కోహ్లీని గట్టిగా ఇబ్బంది పెట్టాడు. మూడో ఓవర్ చివర్లో కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నిస్తుండగా విఫలమవగా, ఖలీల్ అతడిని ఉద్దేశించి ఏదో వ్యాఖ్య చెప్పాడు. దీని కోహ్లీ కూడా గట్టిగా స్పందించాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం చోటు చేసుకుంది. మైదానంలో ఇద్దరి ఒకరినొకరు సీరియస్ చూసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఖలీల్ వ్యాఖ్యల కారణంగా కోహ్లీ రెచ్చిపోయాడు.
వివరాలు
సిక్సర్ తో కోహ్లీ సమాధానం
నాలుగో ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాట్ హెన్రీను లక్ష్యంగా చేసుకుని, కోహ్లీ లెంగ్త్ బంతిని అద్భుతమైన మణికట్టు వేగంతో డీప్ మిడ్-వికెట్ మీదుగా 85 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. అదే 'నో-లుక్' శైలిలో ఆడిన ఈ షాట్ అభిమానులను ఉర్రూతలూగించేలా చేసింది. ఆ ఓవర్‌లో కోహ్లీ మరో ఫోర్ కూడా కొట్టి స్కోరు బోర్డును పరుగులతో నింపాడు. మ్యాచ్‌లో కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) చేసినప్పటికీ, అతను ఒక అరుదైన ఘనత సాధించాడు.
వివరాలు
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై (చెన్నై) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును కోహ్లీ అధిగమించాడు. 1188 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ కోల్‌కతా పై చేసిన 1161 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఖలీల్ స్లెడ్జింగ్ చేయకపోతే కోహ్లీ మరింత స్థిరంగా ఆడేవాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో, కోహ్లీ ఔట్ కావడంతో చెన్నై అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
85 మీటర్ల సిక్సర్ బాదిన కోహ్లీ
𝙏𝙝𝙚 𝙆𝙄𝙉𝙂 𝙙𝙤𝙚𝙨𝙣’𝙩 𝙚𝙫𝙚𝙣 𝙣𝙚𝙚𝙙 𝙩𝙤 𝙡𝙤𝙤𝙠 😮💨@imVkohli turns a good length into a maximum with ease 🤌#TATAIPL 2026 | #RCBvCSK | LIVE NOW 👉 https://t.co/2TGcMIndez pic.twitter.com/wQuV6oqesr
— Star Sports (@StarSportsIndia) April 5, 2026