Page Loader
Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!
Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!

Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఖో ఖో ప్రపంచకప్‌లో భారత్ విజయం కొనసాగుతోంది. వరుస విజయాలతో, పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 70-38 తేడాతో పెరూను ఓడించింది. గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. ఈ మ్యాచ్‌లో ప్రతీక్, ఆదిత్య, శివారెడ్డి, సచిన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. పెరుతో జరిగిన ఈ పోరులో భారత్ నాలుగు టర్న్‌లలోనూ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. తొలి టర్న్‌లో 36 పాయింట్లు సాధించిన భారత్, తరువాతి మూడు టర్న్‌లలోనూ ప్రత్యర్థి మీద ఆధిపత్యం ఉంచుతూ 70 పాయింట్లతో గెలుపు సాధించింది.

వివరాలు 

ప్రియాంక 'బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు

మరోవైపు, భారత మహిళల జట్టు గ్రూప్-ఏలో 100-16 తేడాతో ఇరాన్‌ను ఓడించింది. అశ్విని, నిర్మల, ప్రియాంక, నస్రీన్ తమ అద్భుత ఆటతో భారత్ జట్టును విజయావకాశంలో నిలిపారు. ప్రియాంక 'బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకుంది. ఈ విజయానికి ముందు, భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో 175-18 తేడాతో సౌత్ కొరియాను ఓడించింది.