LOADING...
KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు
కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు

KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
09:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో జాసన్ రాయ్, రాణా ధనాధన్ అనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 200పరుగులు చేసింది. ఆర్సీబీకి 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆది నుంచి కేకేఆర్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా జాసన్ రాయ్ 29బంతుల్లో 56 పరుగులతో దడదడలాడించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితిష్ రాణా 48 పరుగులతో చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లతో డేవిడ్ వీస్ మెరుపులు మెరిపించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

200పరుగులు చేసిన కేకేఆర్