Loading...
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్‌ రికార్డులు బద్దలు.. టీ20ల్లో నయా హిస్టరీ క్రియేట్‌ చేసిన అభిషేక్‌ శర్మ!
కోహ్లీ, రోహిత్‌ రికార్డులు బద్దలు.. టీ20ల్లో నయా హిస్టరీ క్రియేట్‌ చేసిన అభిషేక్‌ శర్మ!

Abhishek Sharma: కోహ్లీ, రోహిత్‌ రికార్డులు బద్దలు.. టీ20ల్లో నయా హిస్టరీ క్రియేట్‌ చేసిన అభిషేక్‌ శర్మ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పేరు మార్మోగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. భారత పురుషుల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ శతకంతో తన టీ20 కెరీర్‌లో సెంచరీల సంఖ్యను 11కు పెంచుకున్నాడు.

వివరాలు

విరాట్‌ కోహ్లీని వెనక్కి నెట్టిన అభిషేక్

ఇప్పటివరకు భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉండేవాడు.

అతడి ఖాతాలో 10 సెంచరీలు ఉన్నాయి. అయితే, న్యూజిలాండ్‌పై సాధించిన శతకంతో అభిషేక్‌ శర్మ కోహ్లీని అధిగమించాడు.

మొత్తం 11 సెంచరీలతో భారత ఆటగాళ్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వివరాలు

భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 సెంచరీలు

11 సెంచరీలు - అభిషేక్‌ శర్మ

10 సెంచరీలు - విరాట్‌ కోహ్లీ

8 సెంచరీలు - సంజూ శాంసన్‌

8 సెంచరీలు - రోహిత్‌ శర్మ

8 సెంచరీలు - కేఎల్‌ రాహుల్‌

ఈ గణాంకాలతో అభిషేక్‌ శర్మ టీ20 క్రికెట్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లు ఉన్న జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడం అతడి దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

35 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్‌ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలోనే భారీగా పరుగులు సాధించి భారత జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడు.

ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో వరుసగా రికార్డులు సాధిస్తూ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.

ADVERTISEMENT