LOADING...
IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జట్ల మధ్య పోటీతో పాటు ఆటగాళ్ల మధ్య ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసు కూడా ఉత్కంఠగా మారింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల జాబితాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ అద్భుత ప్రదర్శనలతో టాప్-5లోకి దూసుకొచ్చి మిగతా ఆటగాళ్లకు గట్టి హెచ్చరికలు పంపించారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 పరుగులు చేసి మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు.

వివరాలు

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

ఈ ఇన్నింగ్స్‌తో అతడు 13 మ్యాచ్‌ల్లో మొత్తం 542 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి కంటే ముందు సాయి సుదర్శన్ 554 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, శుభ్‌మన్ గిల్ 552 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ 530 పరుగులతో నాలుగో స్థానానికి ఎగబాకాడు. కోహ్లీ, రాహుల్ ఇద్దరూ ఈ సీజన్‌లో తలో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 486 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 234.78స్ట్రైక్‌రేట్‌తో ఈ సీజన్‌లో అత్యంత దూకుడైన బ్యాటర్‌గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

వివరాలు

13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు

బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. అతడి తర్వాత కగిసో రబడా 21 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లతో మూడో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాగే ప్రిన్స్ యాదవ్, రషీద్ ఖాన్ తలో 16 వికెట్లతో టాప్-5లో నిలిచి బౌలర్ల మధ్య పోరును మరింత ఆసక్తికరంగా మార్చారు.

Advertisement

వివరాలు

ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం

వ్యక్తిగత రికార్డులతో పాటు ఈ ఆటగాళ్ల ప్రదర్శనలు ఆయా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. కోహ్లీ అద్భుత ఫామ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ బలంగా మారగా, రాహుల్ పరుగుల వేట ఢిల్లీ జట్టుకు ఆశలు పెంచుతోంది. లీగ్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో ఈ క్యాప్‌ల పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement