LOADING...
Uppal Stadium: కోల్‌కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్‌కు భారీ భద్రత 
కోల్‌కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్‌కు భారీ భద్రత

Uppal Stadium: కోల్‌కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్‌కు భారీ భద్రత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో జరిగిన ఉద్రిక్త ఘటనల ప్రభావంతో ఉప్పల్‌ స్టేడియం వద్ద బందోబస్తును మరింత కఠినతరం చేశారు. 'గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా'లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మెస్సి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ బాటిళ్లు, కుర్చీలు విసిరేసి ఉద్రిక్తతలకు దారితీశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Details

3వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత

ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు టికెట్‌ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. అభిమానుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్‌ స్టేడియం పరిసరాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు.

Details

మ్యాచ్ షెడ్యూల్‌ ఇలా ఉంది

రాత్రి 7.50 గంటలకు మెస్సి - గోట్‌ ఫుట్‌బాల్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభం రాత్రి 8.06 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, లియోనెల్‌ మెస్సి మైదానంలోకి ప్రవేశం రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్‌ సువారెజ్‌ మైదానంలోకి రాక రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్‌ రాత్రి 8.18 గంటలకు రాహుల్‌ గాంధీ మైదానంలోకి ప్రవేశం మెస్సీ హైదరాబాద్‌ పర్యటనను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement