LOADING...
Kuldeep Yadav :పెళ్లి పీటలెక్కనున్న కుల్దీప్ యాద‌వ్.. ముస్సోరిలో గ్రాండ్ వేడుక
పెళ్లి పీటలెక్కనున్న కుల్దీప్ యాద‌వ్.. ముస్సోరిలో గ్రాండ్ వేడుక

Kuldeep Yadav :పెళ్లి పీటలెక్కనున్న కుల్దీప్ యాద‌వ్.. ముస్సోరిలో గ్రాండ్ వేడుక

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెట‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ తన వివాహాన్ని ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ నేపథ్యంలో వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోర్నీ ముగియడంతో ఆయన పెళ్లి ఏర్పాట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. కుల్దీప్ యాద‌వ్‌ వివాహం వన్షికతో మార్చి 14న ముస్సోరీలోని ఓ రిసార్ట్‌లో జరగనుంది. ఈ వేడుకకు బీసీసీఐ అధికారులు, ప్రస్తుత మాజీ భారత క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Details 

మార్చి 17న ల‌క్నోలో రిసెప్షన్

వివాహ రిసెప్షన్‌ మార్చి 17న ల‌క్నోలో నిర్వహించనున్నారు. కుల్దీప్ యాద‌వ్‌, వన్షికల నిశ్చితార్థం గ‌తేడాది జూన్ 4న జరిగింది. వన్షిక ఆయన చిన్ననాటి స్నేహితురాలు కాగా, ఆమె తండ్రి ఎల్‌ఐసిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ వివాహం గ‌తేడాది నవంబర్‌లోనే జరగాల్సి ఉండగా, టీ20 వరల్డ్ కప్ కారణంగా అది వాయిదా పడింది.

Advertisement