కుల్దీప్, చాహల్ ఎంపికపై కసరత్తు..!
ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో భారత్ 3-0 తో విజయం సాధించడంతో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడు. భారత్ మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. శ్రీలంక కెప్టెన్ దనుస్‌శనకను కుల్దీప్ ఔట్ చేసిన తీరు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ ఇద్దరు కలిసి వన్డేలో 100 పైగా వికెట్లు తీశారు కుల్దీప్ చాహల్‌తో కలిసి 36 వన్డేలు ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఎక్కువగా ఆడలేదు.
కుల్దీప్ vs చాహల్
2016లో వన్డేలో అరంగేట్రం చేసిన చాహల్ 71 మ్యాచ్‌లు ఆడి 119 వికెట్లు పడగొట్టాడు. 2017లో వన్డేలో చోటు సంపాదించుకున్న కుల్దీప్ 75 మ్యాచ్‌లలో 124 వికెట్లు తీశాడు. కుల్దీప్ స్వదేశంలో 30 వన్డేలు ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుస్లారు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. చాహల్ స్వదేశంలో 17 వన్డేలు ఆడి 28 వికెట్లతో తీశారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో స్పిన్నర్లు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడి పిచ్‌లు పేసర్‌లకు అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో 36 వన్డేలు ఆడిన చాహల్ 61 వికెట్లు తీశాడు. కుల్దీప్ 24 వన్డేల్లో 45 వికెట్లు సాధించాడు.